నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం రాత్రి గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్తి నేరాలు, సైబర్ మోసాలు, అక్రమ కార్యకలాపాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.