టోల్‌గేట్‌ వద్ద అధికారుల తనిఖీలు

టోల్‌గేట్‌ వద్ద అధికారుల తనిఖీలు

NGL: మిర్యాలగూడ మండలంలోని ఆలగడప వద్ద పోలీస్, రవాణా, రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ధాన్యం లారీలు, డీసీఎంల తనిఖీలు నిర్వహించారు. AP నుంచి అక్రమంగా మిర్యాలగూడ ప్రాంతానికి ధాన్యం వాహనాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో  ఇవాళ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో చిల్లేపల్లి టోల్‌గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.