VIDEO: టీటీడీ గోశాలకు 50 లారీల ఎండి గడ్డి
E.G: గోకవరం మండలం తంటికొండ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలకు శనివారం 50 లారీల ఎండుగడ్డిని తరలించారు. జగ్గంపేట MLA, టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఈ లారీలను జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులు స్వచ్ఛందంగా ఈ ఎండుగడ్డిని సేకరించినట్లు ఆయన తెలిపారు.