గడ్డకట్టే చలిలో కాశ్మీర్ రైతుల కష్టం!

గడ్డకట్టే చలిలో కాశ్మీర్ రైతుల కష్టం!

కాశ్మీర్‌లో నద్రు(తామర కాడలు) రైతుల కష్టం చూస్తే అయ్యో అనిపిస్తుంది. గడ్డ కట్టే చలిలో, ఐస్ లాంటి నీళ్లలోకి దిగి మరీ పంట తీస్తున్నారు. కాశ్మీర్ వంటల్లో ఇది ఎంతో ప్రత్యేకం. కానీ ఈసారి దిగుబడి తగ్గి, రేట్లు పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా గిట్టుబాటు కావట్లేదని, కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదని వాపోతున్నారు.