మండలాభివృద్ధికి సహకరించండి: మెళియాపుట్టి ఎంపీపీ

SKLM: మెళియాపుట్టి మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ కోరారు. మెళియాపుట్టి మండల సర్వసభ్య సమావేశం, స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఎంపీడీవో నరసింహ ప్రసాద్ పండా, వైస్ ఎంపీపీ సవర ఆదినాయుడు, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.