గండికోట నుంచి మైలవరానికి నీటి విడుదల బంద్

KDP : గండికోట నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదలను అధికారులు నిలిపి వేశారు. మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యం 9.98 TMCలు కాగా ప్రస్తుతం ఇక్కడ 5.48 TMCలు నీరు నిల్వ ఉంది. ఇక్కడ పూర్తి సామర్థ్యంతో నీటిని ఉంచే పరిస్థితి లేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు డ్యాంలోకి ఇన్ ఫ్లో నిలిపేశారు.