‘రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాల్సిందే’
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన CMల వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి, భద్రత విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో సమష్టిగా పనిచేయడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో 'టీమిండియా' స్ఫూర్తిని చాటాలని, పరస్పర సమన్వయం ఉంటేనే అనుకున్న ఫలితాలు వేగంగా వస్తాయని అభిప్రాయపడ్డారు.