నాగిరెడ్డి కుంట ఎంక్రోచ్ మెంట్‌ను అడ్డుకున్న హైడ్రా
RR: గండిపేట మండలం మంచిరేవులలోని 8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటను కబ్జా చేయాలని ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. చెరువును ఫెన్సింగ్ వేసి ప్లాట్లుగా మార్చి తాత్కాలిక నిర్మాణాలు చేశారు. అయితే రెవెన్యూ, హెచ్‌ఎండీఏ రికార్డుల్లో ఇది చెరువుగా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో స్థానికుల ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును రక్షించారు.