మల్లాపూర్ డివిజన్ లో పర్యటించిన కార్పొరేటర్ పన్నాల

మల్లాపూర్ డివిజన్ లో పర్యటించిన కార్పొరేటర్ పన్నాల

HYD: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కాలనీలో అధికారులతో కలిసి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పర్యటించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజి, రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ దీపాల స్తంభాలు పలు సమస్యలు తన దృష్టికి స్థానికులు తీసుకువచ్చారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు.