గుడ్లవల్లేరులో మహిళా పోలీసులతో సమావేశం

గుడ్లవల్లేరులో మహిళా పోలీసులతో సమావేశం

కృష్ణా: వినాయక చవితి వేడుకలు శాంతియుతంగా సాగేందుకు జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు పోలీసులు సచివాలయ మహిళా పోలీసులతో సమావేశం శనివారం నిర్వహించారు. ఉత్సవాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సత్యనారాయణ సూచించారు. అనుమానాస్పద ఏమైనా గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.