తిరుమల సమాచారం
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,606 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.