బేకరీలో కల్తీ ఉత్పత్తులు.. నిందితుడు అరెస్ట్

బేకరీలో కల్తీ ఉత్పత్తులు.. నిందితుడు అరెస్ట్

TG: హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ బేకరీ యూనిట్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో సయ్యద్ ఖదీర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో సుమారు రూ.2,77,630 విలువైన కల్తీ బేకరీ ఉత్పత్తులు, ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.