ఈ గ్రామం.. దేశానికి రోల్‌మోడల్ : ఆనంద్ మహీంద్రా
మహారాష్ట్ర తడేబా నేషనల్ పార్క్ సమీపంలోని సతారా నేవార్ గ్రామంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. పెద్ద పెద్ద భవంతులు, భారీ పెట్టుబడులు లేకుండానే మార్పు సాధించవచ్చని ఆ గ్రామం నిరూపించిందని కొనియాడారు. ఈ ఘనత మన దేశంలో జరిగిన ఓ నిశ్శబ్ద విజయగాథ అని కితాబిచ్చారు. ఈ మేరకు ఆ గ్రామానికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.