అద్భుతంగా భోగాపురం ఎయిర్ పోర్టు: రామ్మోహన్
AP: భోగాపురం ఎయిర్ పోర్టును అద్భుతంగా సిద్ధం చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వచ్చే నెలలో మరో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్‌కు అనుకున్నాం.. కానీ, ఒక నెల ముందే ప్రారంభిస్తామని తెలిపారు. ఎడ్యుసిటీ అంటే ఎన్నో విద్యా యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. భోగాపురంలో ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుసిటీ అభివృద్ధి చెందుతుందన్నారు.