అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న MLA
BPT: చీరాల మండలం వాడరేవు గ్రామంలో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. వాడరేవు 1, వాడరేవు 2 ప్రాంతాల్లో రూ. 72 లక్షల వ్యయంతో ఈ సెంటర్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యమని, గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.