శ్రీరామనవమి వేడుకలు.. తీవ్ర ఉద్రిక్తత

శ్రీరామనవమి వేడుకలు.. తీవ్ర ఉద్రిక్తత

పశ్చిమబెంగాల్‌లో శ్రీరామనవమి వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో ఆయుధాలను ప్రదర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయుధ ప్రదర్శన తమ సంప్రదాయంలో భాగమని కొన్ని సంఘాలు వెల్లడించాయి. పోలీసుల చర్యను నిరసిస్తూ హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.