ఆకాశవాణి రేడియో కేంద్రంలో ఆదర్శ రైతులకు సన్మానం

WGL: జిల్లా కేంద్రంలోని ఆకాశవాణి రేడియో కేంద్రంలో నేడు రేడియో కిసాన్ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ ప్రారంభించారు. జిల్లాలోని ఆదర్శ రైతులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ దిలీప్, మున్సిపల్ శాఖ చీఫ్ హార్టికల్చర్ అధికారి రమేష్, వ్యవసాయ శాఖ సాంకేతిక అధికారి కమలాకర్ పాల్గొన్నారు.