స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి : బీజేపీ
SKLM: ఆమదాలవలస (M)లో బీజేపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు CH. అప్పారావు ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జిల్లాలో ప్రతి ఇంటా స్వదేశీ ఉద్యమం విస్తృతంగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.