ప్రశాంతంగా ముగిసిన మక్తల్ ఉప ఎన్నిక
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఈ ఎన్నికలో 89.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి నాగశివ తెలిపారు. కాగా, సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్లు వెల్లడించారు.