దుమ్ము సమస్యపై యువత స్వచ్ఛంద చర్య

దుమ్ము సమస్యపై యువత స్వచ్ఛంద చర్య

SRPT: మేళ్లచెరువు మెయిన్ రోడ్డుపై దుమ్ము అధికంగా ఎగిసిపోవడంతో ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో చివరికి యువకులు ఏకమై స్వచ్ఛందంగా రోడ్డుపై నీళ్లు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు స్పందించాలని యువకులు కోరారు.