VIDEO: ఈరోజు సాయంత్రం వరంగల్ కి చికోటి ప్రవీణ్
WGL: శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సాయంత్రం 'హిందూ సంకల్ప యాత్ర బైక్ ర్యాలీ' నిర్వహించనున్నట్లు హిందూ సేవా సమితి అధ్యక్షుడు నాగపురి వెంకటేశ్ తెలిపారు. ఈ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. కడిపికొండ బ్రిడ్జి వద్ద ప్రారంభమై WGL చౌరస్తా వరకు ఈ ర్యాలీ జరుగుతుందని, అనంతరం ముగింపు సభలో ప్రవీణ్ పాల్గొంటారని అన్నారు.