కేసీఆర్ తోనే తెలంగాణలో అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యే

NZB: కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. గంప గోవర్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మాటల ప్రభుత్వం కొనసాగుతుందని, కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపుతున్నారు అన్నారు.