సలాబాత్పూర్ ఆలయ హుండీ లెక్కింపు మళ్లీ వాయిదా..!
KMR: మద్నూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవాళ జరగవలసిన హుండీ లెక్కింపు అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు ఆలయ కార్యనిర్వాహనాధికారి పి. శ్రీధర్ తెలిపారు. కాగా, వరుసగా రెండో సారి హుండీ లెక్కింపు వాయిదా పడింది. మళ్లీ హుండీ లెక్కింపు ఎప్పుడు ఉంటుందో తెలియజేస్తామని ఈవో తెలిపారు.