VIDEO: పాము రూపంలో వనదేవతల దర్శనం
MHBD: గూడూరు మండలం చింతలగట్టులో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గురువారం ఆలయ గద్దెల వద్ద నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాము రూపంలో వనదేవతలు దర్శనం ఇచ్చాయని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘటనతో జాతర ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది.