నేడు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

నేడు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

SRD: సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు.