గల్ఫ్ దేశాల్లో కోటి మంది భారతీయులు: జైశంకర్
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. సంయమనం పాటించాలని కేంద్రమంత్రి జైశంకర్ విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది వరకు భారతీయులు నివసిస్తున్నారని తెలిపారు. అలాగే, ఇరాన్‌లో కూడా వేలాది మంది ఉన్నారని చెప్పారు. ఈ ప్రాంతాల్లో భద్రత క్షీణిస్తోందని వాపోయారు. ఇరాన్‌లో ఉన్న భారత విద్యార్థులు అర్మేనియాకు వెళ్లడానికి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.