నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే చర్యలు

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే చర్యలు

JGL: మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహనదారులు ఎవరైనా తమ వాహనాలకి ముందు, వెనుక సరియైన నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై కిరణ్ కుమార్ అన్నారు. హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మైనర్లు డ్రైవింగ్ చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.