శబరిమల పాదయాత్ర స్వాములకు ఘన స్వాగతం
SRD: శబరిమల మహాపాదయాత్ర ముగించుకొని సంగారెడ్డికి వచ్చిన స్వాములకు పోతిరెడ్డిపల్లి హనుమాన్ దేవాలయం వద్ద శుక్రవారం ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో శబరిమలకు మహా పాదయాత్రగా వెళ్లిన 28 మంది స్వాములను శాలువాలతో పూలదండలతో సన్మానించారు. సంగారెడ్డి నుంచి తిరుమల కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమలకు పాదయాత్రగా వెళ్లినట్లు రాము తెలిపారు.