అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
SDPT: తొగుట మండలం రాంపూర్‌కు చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు తోయేటి వెంకటేష్ (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక వెంకటేష్ పురుగుల మందు సేవించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటేష్ భౌతిక కాయనికి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.