ఈ నెల 30న జాబ్ మేళా

VZM: ఈ నెల 30న మహిళా ప్రాంగణం వద్ద గల ప్రభుత్వ ITIలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అరుణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ బయోటెక్, హీరో మోటో కార్స్, మెడ్ ప్లస్ ఫార్మసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, తదితర 8 కంపెనీలలో 705 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.