'భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి'

KMM: భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌కు ఎమ్మెల్యే మట్ట రాగమయి సూచించారు. బుధవారం తల్లాడ మండలం పినపాక గ్రామంలో సబ్ కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.