సీపీఐ ఎంఎల్ బైక్ ర్యాలీ

KRNL: మే డేను పురస్కరించుకుని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.