సుల్తానాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం: ఎమ్మెల్యే

సుల్తానాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం: ఎమ్మెల్యే

PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలో రూ.6 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్ల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహం నుండి గట్టేపల్లి చౌరస్తా వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, ఐలాండ్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనుల ద్వారా సుల్తానాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.