ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు జెలెన్‌స్కీ Xలో పోస్టు పెట్టారు. 'ఇరాన్‌ ప్రభుత్వానికి రష్యా ఇంటెలిజెన్స్‌ మద్దతు అందిస్తోంది. ఇందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇది విధ్వంసకర చర్య. దీన్ని వెంటనే ఆపాలి. లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుంది' అని ఆందోళన వ్యక్తం చేశారు.