'వంద శాతం పన్ను బకాయిలు వసూలు చేయాలి'

NLG: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వంద శాతం పన్ను బకాయిలను వసూలు చేయాలని నల్గొండ జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య ఆదేశించారు. శనివారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.