బిజ్వారం సర్పంచ్ అభ్యర్థిగా వై. శైలజమ్మ నామినేషన్

బిజ్వారం సర్పంచ్ అభ్యర్థిగా వై. శైలజమ్మ నామినేషన్

GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో గ్రామ ప్రజల ఐకమత్య మద్దతుతో, సీనియర్ నాయకులు వై. శ్రీనివాస్ రెడ్డి సతీమణి వై. శైలజమ్మ సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేశారు. ఆమె మంచితనానికి, అభిమతానికి ఏకమై మద్దతుగా భారీ ర్యాలీతో గ్రామ ప్రజలు తరలివచ్చారు. నామినేషన్ అనంతరం శైలజమ్మ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికై అనునిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.