'రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారండి'
శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నారి మణి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారండి అని అన్నారు.