ఆగిన సింధూ నీరు.. పాక్‌కు రక్త కన్నీరు

పహల్గామ్ దాడితో చేయకూడని దుర్మార్గం చేసిన పాక్ దానికి ప్రతిగా భారత్ తీసుకున్న చర్యలతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ముందుగా నడిచే దారి కనిపించక భారత్‌తో కాళ్లబేరానికి వస్తోంది. సింధూ జలాల ఒప్పందం రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పున:సమీక్షించుకోవాలని భారత్‌ను పాక్ వేడుకుంటోంది. చర్చలకు సిద్ధం అంటూ కొత్త పాట పాడుతోంది.