'తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు ఇవ్వాలి'

'తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు ఇవ్వాలి'

MHBD: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యను గురువారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం తొర్రూరు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ముద్దసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు పెన్షన్లు మంజూరు చేసేలా కృషి చేయాలని కోరారు.