ఉరివేసుకుని టీడీపీ నేత ఆత్మహత్య
NTR: పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకి చెందిన టీడీపీ నాయకుడు, సొసైటీ అధ్యక్షుడు చింత వెంకటేశ్వరరావు (బుల్లియ్య) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గత అర్ధరాత్రి తన నివాసంలో ఉరివేసుకున్నారు. తెల్లవారుజామున గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కారణాలు తెలియాల్సి ఉంది.