8 మంది బాలుర జువైనల్ హోమ్‌కు తరలింపు

8 మంది బాలుర జువైనల్ హోమ్‌కు తరలింపు

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శుక్రవారం 8 మంది బాలురను ఒకరోజు పరిశీలన కోసం జువైనల్ హోమ్‌కు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ పిట్టల వెంకన్న తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణంలో తనిఖీలు చేసి మైనర్ డ్రైవింగ్ చేస్తున్న ఎనిమిది మంది పిల్లలను పట్టుకొని కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి ఆదేశం మేరకు జువైనల్ హోముకు తరలించినట్లు తెలిపారు.