అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ
VZM: జిల్లాలో పలు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవిన్యూ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు భూములను త్వరగా ఇవ్వాలని సూచించారు.