'రూ.85 వేల కోట్ల విలువైన పత్తిని కొనుగోలు జరిగింది'
TG: పత్తి కొనుగోలు విషయంలో అవగాహన లోపంతో రాష్ట్రంలో కొన్ని సమస్యలు తలెత్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'కేంద్ర టెక్స్‌లైల్ శాఖ కార్యదర్శితో మాట్లాడాను. జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సమ్మె విరమించాలని వ్యవసాయ శాఖ మంత్రి కోరారు. ఇందుకు జిన్నింగ్ మిల్లులు అంగీకరించాయి. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల విలువైన పత్తిని కేంద్రం కొనుగోలు చేసింది' అని తెలిపారు.