జగన్‌ను కలిసిన జిల్లా వైసీపీ అధ్యక్షురాలు

సత్యసాయి: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కలిశారు. మడకశిర నియోజకవర్గ కార్యకర్తల సమస్యలను స్థానిక నాయకులతో కలిసి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. విభేదాలను పక్కన బెట్టి అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.