బాధితులను పరామర్శించిన ఫిరోజ్ ఖాన్

బాధితులను పరామర్శించిన ఫిరోజ్ ఖాన్

HYD: అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటనపై నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఘటనస్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అఫ్జల్ సాగర్‌లో నివసిస్తున్న పేదవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని గతంలోనే అనేకసార్లు అధికారులను కోరానని, వారికి ఇళ్లు కేటాయించాలన్నారు.