అందెశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కవిత
TG: అందెశ్రీ మృతి పట్ల జాగృతి అధ్యక్షురాలు కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందని విచారం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్సీ కోదండరాం కూడా వెళ్లి అందెశ్రీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. స్వరాష్ట్ర సాధనలో అందెశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంది అని పేర్కొన్నారు.