పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
NRPT: నారాయణపేట మండలంలోని లింగంపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి కాటన్ మిల్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన పత్తి నాణ్యతను ఆమె పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలను తనిఖీ చేసి, కొనుగోలు పనులపై రైతులతో మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు.