'మార్వాడీ గో బ్యాక్' వివాదం.. స్పందించిన ఎంపీ లక్ష్మణ్

'మార్వాడీ గో బ్యాక్' వివాదం.. స్పందించిన ఎంపీ లక్ష్మణ్

TG: రాష్ట్రంలో 'మార్వాడీ గో బ్యాక్' ఉద్యమం ఊపందుకుంది. మార్వాడీలు స్థానిక వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ వివాదంపై స్పందిస్తూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలాంటి ఉద్యమాలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.