ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు: ఎంపీ
NTR: విజయవాడ ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేసినేని చిన్ని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజల దశాబ్దాల కల సహకారం అయిందని, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. అమరావతి రైతుల త్యాగం, మహిళల రక్తం, కన్నీరు, త్యాగ ఫలితమని కొనియాడారు.