మంత్రి ఆదేశాల మేరకు క్రికెట్ కిట్లు పంపిణీ
KNR: సైదాపూర్ మండలం ఆరెపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సర్పంచ్ వర్నె లావణ్య యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. యువత క్రీడల్లో రాణించాలని ఉద్దేశ్యంతో ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కోలె అశోక్, వార్డు సభ్యులు సతీశ్, సుజాత శ్రీనివాస్, లక్ష్మీ రాజయ్య, వెంగళ కుమార్, తిరుపతి, తదితరుల పాల్గొన్నారు.